రాజకీయ వార్తలు వార్తలు

నాయిని వ్యాఖ్యలపై విజయశాంతి ఫైర్!

Vijayashanti Ready To Elections

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విశాఖ జిల్లాలో మావోలు ఇద్దరు నేతలను హతమార్చిన ఘటన పై తెలంగాణ అపద్దర్మ హోమ్ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ నాకురాలు విజయశాంతి ఘాటుగా స్పందించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు ఆదివారం దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

ఈ విషయంపై స్పందించిన నాయిని.. తెలంగాణలో మావోయిస్టుల బెడద లేదని వ్యాఖ్యానించారు. నాయిని వ్యాఖ్యలను విజయశాంతి తిప్పి కొట్టారు. తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదనడం సరికాదని ఆమె అన్నారు. అణచివేత ఉన్న చోట తిరుగుబాటు వస్తుందని ఆమె హెచ్చరించారు. వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌ల పైశాచిక హత్యలపై కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదని విమర్శించారు. చంపడం తప్పయితే అందులో ప్రభుత్వాలకు మినహాయింపు లేదని తెలుసుకోవాలని ఆమె సూచించారు.

Related posts

ఏపీ బీజేపీ అశోక్ బాబు పై గవర్నర్ కు పిర్యాదు…

admin

కౌశల్ కి షాక్ … శాశ్వత ఎలిమినేషన్… బాధలో కౌశల్ ఆర్మీ

jithu j

యామినీ భాస్కర్ ‘చిత్రాలు’…

chandra sekkhar

Leave a Comment