telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

స్టాలిన్ షాక్ తో కేసీఆర్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్: విజయశాంతి

Congress vijayashanti comments Modi Kcr

డీఎంకే అధినేత స్టాలిన్ ఇచ్చిన షాక్ తో టీఆరెస్ అధినేతకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్లుందని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గజకర్ణ, గోకర్ణ విద్యలు తమిళనాడులో ఫలించలేదని ఆమె అన్నారు. చీప్ ట్రిక్స్‌ కు స్టాలిన్ చెక్ పెట్టారని ఎద్దేవా చేస్తూ, తన ఫేస్ బుక్ ఖాతాలో విజయశాంతి ఓ  పోస్ట్ పెట్టారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ ను బుట్టలో వేసుకున్నట్టుగానే స్టాలిన్ ను బురిడీ కొట్టించాలని చూసిన కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో గత మూడు నెలలుగా ఆడిన డ్రామాకు తెరపడిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తానని ప్రగల్బాలు పలికిన గులాబీ బాస్, ఇప్పుడు దిక్కు తోచని స్ధితిలో ఉన్నట్లు ఫేస్ బుక్ లో విజయశాంతి దుయ్యబట్టారు.

Related posts