telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఢిల్లీ రైతుల ఉద్యమంపై విజయశాంతి కామెంట్‌ !

ఢిల్లీ రైతుల ఉద్యమంపై విజయశాంతి కామెంట్‌ చేసింది. రైతుల ఉద్యమంలో బయటి వ్యక్తులు చొరబడినట్లు ఆమె వ్యాఖ్యనించారు. “రైతుల ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చోటు చేసుకున్న సంఘటనలు నిజంగా విచారకరం. పోలీసులపై దాడులు, ఎర్రకోటపై జండాల ఎగరవేత తదితర పరిణామాలను గమనిస్తే… ఇవన్నీ విపక్ష ప్రేరేపిత శక్తుల కుట్రేనని తెలుస్తోంది. కేంద్రం ఎన్నిసార్లు చర్చలకు పిలిచినా ఓపికగా వచ్చిన రైతులు ఇటువంటి హింసకు పాల్పడరు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతులతో సంబంధం లేని వ్యక్తులు వారిలో చేరి అన్నదాతలను ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారో సోషల్ మీడియాలో రుజువులతో సహా పలు వీడియో సాక్ష్యాలు అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉన్నాయి. కేంద్రానికి, రైతులకు మధ్య జరుగుతున్న చర్చలు ఫలవంతమైతే జనంలో నామరూపాలు లేకుండా పోతామనే భయంతోనే ప్రతిపక్షాలు రైతుల్ని రెచ్చగొడుతూ రిపబ్లిక్ డేని అందుకు సందర్భంగా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. రైతు చట్టాలపై విపక్షాల దుష్ప్రచారం… చర్చల్ని చెడగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయి. కేంద్రం ఇప్పటికే రైతుల ఆందోళనను ఉపశమింపచేస్తూ ఈ చట్టాల అమలుకు సంబంధించి పలు చర్యలు తీసుకుంది. త్వరలోనే మరిన్ని సత్ఫలితాలు వెలువడతాయని నేను ఆశాభావంతో ఉన్నాను.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు. 

Related posts