telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కెసిఆర్ పై మరోసారి విజయశాంతి ఫైర్…దొరగారు అంటూ

vijayashanthi

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి కారణం కెసిఆర్ ప్రభుత్వమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా..సీఎం కెసిఆర్ పై మరోసారి విజయశాంతి ఫైర్ అయింది. “జంటనగరాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకూ కురిసిన భారీ వర్షాలు ప్రజల్ని గతంలో ఎప్పుడూ లేనంత నిస్సహాయ పరిస్థితుల్లోకి నెట్టివేయడం కళ్ళారా చూశాం. వరదనీరు కాలువల్లా పారని వీధి లేదు… ఏరులై ప్రవహించని రోడ్డు లేదు. దశాబ్దాల కాలంగా నెలకొన్న ఈ దౌర్భాగ్య పరిస్థితికి గత ప్రభుత్వాలే కారణమని సీఎం కేసీఆర్ దొరగారు ఎన్నోమార్లు నిందించారు. ప్రకృతిని నియంత్రించడం మన వల్ల కాదు కానీ…. చినుకు పడితే చాలు చెదిరిపోయే జంటనగర ప్రజలను వరద కష్టాల నుంచి రక్షించేందుకు గడచిన మీ ఆరేళ్ళ పరిపాలనా కాలంలో ఏ కాస్తయినా చిత్తశుద్ధితో సేవ చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. తక్కువ ఇబ్బందులతో ప్రజలు గట్టెక్కేవారు. వానలు తగ్గినా రోజుల తరబడి కాలనీలకు కాలనీలు నీళ్ళల్లోనే నానుతుండటం… కరెంట్ కోతలు చాలావరకు తగ్గి ఉండేవి. కేసీఆర్ సర్కారు పాలనా పగ్గాలు అందుకున్న మొదటి, మలి విడతల పరిపాలనా కాలంలో ఈ పరిస్థితుల నుంచి పౌరులను రక్షించేందుకు ఏ పరిష్కారాలు చూపించారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చాలు. టీఆరెస్ అధికారంలోకి రాకముందే ఎన్నెన్నో చెరువుల దురాక్రమణ, భూముల కబ్జాలు… అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయని కేసీఆర్ పదే పదే అన్నారు. కానీ, జరిగిందేమిటి? మీరైనా ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వెయ్యగలిగారా? మీ నిర్వహణ ఏ తీరున ఉందో జలగండంలో చిక్కుకున్న మీ కలల విశ్వనగరాన్ని చూస్తే చాలు.” అంటూ విమర్శలు చేసింది విజయశాంతి.

Related posts