telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వకీల్ సాబ్ సినిమాపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ, బీజేపీ లపై వైసీపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ సినిమా పోస్టర్లు అంటించడానికి చంద్రబాబు మరియు బీజేపీలు ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. “సినిమా ప్రమోషన్లలో హీరో, హీరోయిన్లు, కమెడియన్లు పాల్గొని సక్సెస్ కోసం వాళ్ల తిప్పలేవో వాళ్లు పడుతుంటారు. ప్యాకేజి స్టార్ రీమేక్ మూవీ కోసం బాబు, అను’కుల మీడియా, బిజెపి పెద్దలు ‘పోస్టర్లు అతికించే’ స్థాయికి దిగజారడం రాజకీయాలకు దాపురించిన దరిద్రం కాక మరేంటి? నాడు: టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ నినాదం: “సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు”. నేడు: టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నినాదం: “పార్టీ లేదు… బొక్కా లేదు” ” అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో “అంటరానితనాన్ని, కుల నిర్మూలనను సమాజం నుంచి పారద్రోలడానికి అహర్నిశలు కృషి చేసి, భారత రాజ్యంగాన్ని రూపొందించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి అర్పిస్తున్నా.” అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Related posts