telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

షర్మిల బహిరంగ సభకు వైఎస్ విజయమ్మ!

వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక, వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు.. తెలంగాణ సర్కార్ వైఫల్యాలను కూడా ఎత్తి చూపడం మొదలు పెట్టారు. ఏప్రిల్‌ 9వ తేదీన పార్టీ ప్రకటన ఉంటుందని… లక్షమంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు. ఇందులో భాగంగానే ఈనెల 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభ జరపాలని షర్మిల వర్గం నిర్ణయించింది. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ నుంచి YCP ఒక పార్లమెంట్‌తో పాటు మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అందుకే ఇక్కడే సభ పెట్టాలని షర్మిళ వర్గం భావించింది. ఈ సభకు లక్ష మందిని తరలించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే తాజా పరిస్థితులు చూస్తే ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం సెకెండ్‌ వేవ్‌ గట్టిగా ఉండడంతో సభకు అనుమతి లభించినా… వారి లక్ష్యం మాత్రం నెరవేరేలా కనిపించడం లేదు. పోలీసులు పర్మిషన్‌ అయితే ఇచ్చారు కానీ… ఆరు వేల మందితో మాత్రమే సభ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 6 వేల మందితో అంటే అది ఆత్మీయ సభ మాత్రమే అవుతోందని అంటున్నారు షర్మిళ వర్గీయులు. ఇది ఇలా ఉండగా… తాజాగా ఈ సభకు సంబంధించి ఓ షాకింగ్‌ వార్త బయటకు వచ్చింది. షర్మిల బహిరంగ సభకు ఆమె తల్లి విజయమ్మ హాజరుకానున్నారని సమాచారం. తల్లిని పక్కన పెట్టుకుని పార్టీ ప్రకటన చేయాలని షర్మిల భావిస్తున్నారు. తన పార్టీకి తన తల్లి విజయమ్మ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే షర్మిల ప్రకటించారు.

Related posts