telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా ప్రేమను సీక్రెట్ గానే ఉంచుతా… : విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

తాజాగా విజయ్ ‘మోస్ట్ డిజరైబుల్ మెన్’ 2019లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. 2018లోనూ మొదటి స్థానంలో ఉన్న విజయ్  ఏడాది కూడా తన నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకున్నాడు. 2019 సంవత్సరానికిగాను హైదరాబాద్ టైమ్స్ ‘మోస్ట్ డిజైరబుల్ మెన్’ జాబితాలో విజయ్ దేవరకొండ తొలి స్థానంలో నిలిచాడు. వరుసగా ఫ్లాపులు పడుతున్నప్పటికీ మనోడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని దీంతో ప్రూవ్ అయింది. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ తన లవ్‌లైఫ్ గురించి మాట్లాడాడు. “నేను ప్రేమలో పడినా సరే ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచుతాను. అది నా వ్యక్తిగత వ్యవహారం. దాని గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేం వ్యాపారం కాదు. నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మాత్రం చెబుతాను. ఏదో రోజు ప్రపంచానికీ చెబుతాను. కానీ, దానికి సమయం ఉంది. నా జీవితం వేరొకరికి వినోదంగా మారడం నాకిష్టం ఉండదు” అని విజయ్ అన్నాడు.

Related posts