telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీలంక క్రికెటర్ బయోపిక్ “800”లో స్టార్ హీరో

Vijay-Sethupathi

బాలీవుడ్‌లో బయోపిక్ హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్రీడాకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలు వెండితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంతో ప‌లు చిత్రాలు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా శ్రీలంక స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ జీవిత నేప‌థ్యంలోను సినిమా చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ బయోపిక్‌లో ముత్తయ్యగా విజయ్‌ సేతుపతి నటించబోతున్నారు. శ్రీపతి రంగస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 800 అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. టెస్ట్ క్రికెట్‌లో ముర‌ళీధ‌ర‌న్ 800 వికెట్స్ సాధించ‌గా, ఆ నెంబ‌ర్‌తోనే సినిమా రూపొంద‌నుంద‌ని అంటున్నారు. ముత్తయ్య మురళీధరన్‌ తమిళ సంతతికి చెందిన స్పోర్ట్స్‌ పర్సన్ కాగా, ఆయ‌న పాత్ర‌లో న‌టించడం స‌వాల్ లాంటిద‌ని విజ‌య్ అంటున్నారు. ఈ చిత్రాన్ని థార్‌ మోషన్‌ పిక్చర్స్‌ నిర్మించనుంది. బాల్‌ని మెలిక‌లు తిప్పుతూ క‌ళ్ళ‌తో బ్యాట్స్‌మెన్‌ని భ‌య‌పెట్టించే ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ విజ‌యవంతం కావాలని కోరుకుందాం. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా 83 మూవీ రూపొందుతుంది.

Related posts