telugu navyamedia
సినిమా వార్తలు

తండ్రిపాత్రలో స్టార్ హీరో

Vijay-Sethupathi

మెగా మేనల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో “ఉప్పెన” అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. జాలర్ల నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో హీరోయిన్ కృతి తండ్రి పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. తండ్రి పాత్రకి స్కోప్ ఎక్కువ ఉన్న నేప‌థ్యంలోనే విజ‌య్ ఈ పాత్ర‌కి అంగీకరించాడ‌ని అంటున్నారు. ఇదిలా ఉంటే విజ‌య్ సేతుప‌తి ప‌లు త‌మిళ చిత్రాల‌లో న‌టిస్తూనే చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతున్న “సైరా న‌ర‌సింహ‌రెడ్డి” చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

Related posts