telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బన్నీకి విలన్ గా కోలీవుడ్ స్టార్… పారితోషికం ఎంతంటే ?

mandi ad troubles vijay setupati

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా “అల వైకుంఠపురంలో” చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొంద‌బోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కాగా లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ను ఢీ కొట్టే విల‌న్‌గా కోలీవుడ్ స్టార్, మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి నటించబోతున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. కాగా… ఇటీవల సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయ్‌, ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఎప్పెన సినిమాలోనూ నటిస్తున్నాడు. తాజాగా మరో మెగా హీరో అల్లు అర్జున్ సినిమాలో నటించేందుకు కూడా ఈ స్టార్ హీరో సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నటనకు ఆస్కారం ఉంటూ భాష ఏదైనా, పాత్ర ఏదైనా చేసేందుకు ఓకే అంటున్నాడు విజయ్‌ సేతుపతి. ఇప్పటికే సుకుమార్‌ స్క్రిప్ట్‌ కూడా వినిపించాడట. అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు విజయ్‌కి భారీ పారితోషికం ఆఫర్‌ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలుగులో యంగ్ జనరేషన్‌ హీరోలు చాలా మంది తీసుకునే పారితోషికం కన్నా ఎక్కువగా దాదాపు కోటిన్నర రూపాయల రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేశారట. కథ, క్యారెక్టర్‌తో పాటు రెమ్యూనరేషన్‌ కూడా నచ్చటంతో విజయ్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.

Related posts