telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్‌తో కయ్యానికి దిగనున్న విజయ్‌ సేతుపతి ?

బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ప్రభాస్‌ ఎదిగిన విషయం తెలిసిందే. ఈ పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ఇటీవలే చేసిన మరో భారీ ప్రాజెక్ట్‌ “సలార్‌” మూవీ. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ఎప్పటి నుంచో అనుకుంటున్నా… ఈ సాలిడ్‌ సినిమా మోస్ట్‌ అవైటెడ్‌ ప్రాజెక్టుగా నిలిచింది. ఇటీవలే సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. ‘ది మోస్ట్ వాలైంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వాలైంట్’ అంటూ ప్రభాస్ గూర్చి తెలియజేస్తూ “సాలార్” టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ లుక్ అలరిస్తుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. అయితే.. తాజాగా ఈ సినిమాలో విలన్‌గా తమిళ్‌ హీరో విజయ్‌ సేతుపతిని అనుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రిలీజైన విజయ్‌ “మాస్టర్‌” సినిమాలో విలన్‌గా నటించారు సేతుపతి. ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ప్రభాస్‌ సలార్‌ మూవీలోనూ సేతుపతి విలన్‌గా చేయబోతున్నారట. ఇందులో భాగంగానే ప్రభాస్‌-సేతుపతి కాంబినేషన్‌ సన్నివేశాలు ముందుగానే తెరకెక్కించనున్నారని టాక్‌. అయితే.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Related posts