telugu navyamedia
సినిమా వార్తలు

ఆస్ట్రేలియా చలన చిత్రోత్సవం… ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి

Super-Deluxe

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో భారతీయ చలన చిత్రోత్సవం జరుగుతోంది. ఈ వేడుకలో ఇండియాలోని పలు భాషలకు చెందిన 60 చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. వీటిలో తమిళ పరిశ్రమనుంచి కుమారరాజ త్యాగరాజన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి నటించిన “సూపర్‌ డీలక్స్‌” చిత్రం ప్రదర్శించబడి ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్ర విభాగాలకు సంబంధించి పోటీ నెలకొంది. ఉత్తమ నటుడిగా విజయ్‌ సేతుపతి ఎంపికై అవార్డును దక్కించుకున్నారు. ఈ చలన చిత్రోత్సవంలో రణవీర్‌ సింగ్‌ నటించిన “గల్లీ బాయ్‌” ఉత్తమ చిత్రంగా, ఆ చిత్ర దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. అదే చిత్రంలో నటించిన నటి టబు ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈ కార్యక్రమంలో షారుక్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ నటీనటులు పాల్గొన్నారు. విజయ్‌ సేతుపతి నటి గాయిత్రితో పాటు చలన చిత్రోత్సవంలో పాల్గోన్నాడు.

Related posts