telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా”లో విజయ్ సేతుపతి లుక్

Vijay Sethupathi,Sye Raa Narasimha Reddy

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తోన్న చిత్రం “సైరా నరసింహారెడ్డి”. రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలోనయనతార నరసింహారెడ్డి భార్య సిద్దమ్మ పాత్రలో, అమితాబ్ బచ్చన్ నరసింహారెడ్డి గురువు పాత్రలో, తమిళ నటుడు విజయ్ సేతుపతి “రాజా పాండి” అనే పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సినిమాలో విజయ్ సేతుపతి లుక్ ని విడుదల చేసింది. ఈ లుక్ లో విజయ్ సేతుపతి విభిన్నమైన కాస్ట్యూమ్స్ తో, కత్తి పట్టుకుని కనిపిస్తున్న తీరు వైరల్ గా మారింది. ఈ సినిమాను ఆగష్టు లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Related posts