telugu navyamedia
సినిమా వార్తలు

వివాదంలో స్టార్ హీరో… ముఖ్యమంత్రిని పొగిడినందుకే…!?

Vijay-Sethupathi

తమిళనాట స్టార్ హీరోగా స్థానం సంపాదించుకున్న విజయ్ సేతుపతికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి వుండే మనస్తత్వంతో స్టార్ హీరోగా ఎదిగారు. దక్షిణాదిలో మంచి టాలెంట్ ఉన్న హీరోల్లో ఒకరైన విజయ్ సేతుపతికి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు వివాదాల జోలికి వెళ్లకుండా క్లీన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా ఈ హీరో చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పించడంపై కొన్ని నెలల కిందట సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ తీర్పుని చాలామంది ప్రజలు వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. అయితే కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్ కోర్టు తీర్పుతో మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లడానికి పోలీసు భద్రత కల్పించారు. దీంతో ఆయనపై ప్రజల నుండి ఆయనకు మరింత వ్యతిరేకత మొదలైంది. తాజాగా విజయ్ సేతుపతి తన సినిమా షూటింగ్ కోసం కేరళకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడిన విజయ్ సేతుపతి శబరిమల విషయంలో ముఖ్యమంత్రి విజయన్ ని పొగుడుతూ, తాను విజయన్ కి అభిమానిని అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కేరళతో పాటు విజయ్ సొంత రాష్ట్రమైన తమిళనాడులో కూడా ఈ హీరోపై నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి.

Related posts