telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్టికల్ 370 అప్రజాస్వామికం అంటున్న విజయ్ సేతుపతి

Vijay-Sethupathi

జమ్ముకశ్మీర్‌కి స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయానికి సినీ ప్రముఖులు తమ మద్దతు ప్రకటించారు. రజనీకాంత్ ఇప్పటికే మోదీ సర్కారు నిర్ణయాన్ని సమర్థించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్…ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలను శ్రీకృష్ణార్జునులుగా అభివర్ణించడం తెలిసిందే. అయితే మోదీ సర్కారు నిర్ణయాన్ని హీరో కమల హాసన్ తప్పుబట్టగా…తాజాగా మరో హీరో విజయ్ సేతుపతి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికమని విజయ్ సేతుపతి అభిప్రాయపడ్డారు. కశ్మీరీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. మన నిర్ణయాలను మరొకరిపై బలవంతంగా రుద్దడం సరికాదని ఆస్ట్రేలియాకు చెందిన ఓ తమిళ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశంపై విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Related posts