• Home
  • Trending Today
  • విజయ్ సేతుపతి, సుదీప్ సరికొత్త లుక్… అంతా “సైరా” కోసమే…!
Trending Today సినిమా వార్తలు

విజయ్ సేతుపతి, సుదీప్ సరికొత్త లుక్… అంతా “సైరా” కోసమే…!

sudeep-and-vijay-sethupathi

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం “సైరా నరసింహారెడ్డి”. ఈ చిత్రంతో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, సుదీప్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

నేడు అమితాబ్ 76వ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ మోషన్ టీజర్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నపాత్రలో అమితాబ్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అందుకే ఆయా భాషల నుంచి అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ లను కూడా కీలకమైన పాత్రల కోసం తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సుదీప్ ల ఫస్టులుక్ లను విడుదల చేశారు. విభిన్నమైన వేషధారణతో ఇద్దరూ కూడా సరికొత్తగా కనిపిస్తున్నారు ఈ లుక్ లో. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.

Related posts

ఉజ్జయినిలో ఫోటోషూట్ తో సంచలనం సృష్టించిన మోడల్

vimala t

ఏటీఎంలో నుంచి ఉండ్రాళ్లు!

jithu j

'సైయాన్…' పాట విన్నారా…

admin

Leave a Comment