telugu navyamedia
news telugu cinema news trending

విజయ్ మాస్టర్ .. విడుదల తేదీ ఖరారు..

vijay master movie releasing date

తమిళ నటుడు విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మాస్టర్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు అమితమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. దాంతో విడుదలకు ఇంకా మూడు నెలల సమయం వున్నా అప్పుడే ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ అయ్యింది. అందులో భాగంగా చిత్రం యొక్క ఓవర్సీస్ థియేట్రికల్ మరియు డిజిటల్ హక్కులను యునైటెడ్ ఇండియన్ ఎంటర్ ప్రైజెస్ , మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ సంస్థలు 33.5కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాయి. విజయ్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ కావడం విశేషం.

తెలుగులో యువ నిర్మాత మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాడు. అందుకు గాను మహేష్ 9కోట్ల వరకు చెల్లించాడట ఇంతకుముందు విజయ్ నటించిన బిగిల్ ను కూడా విజిల్ పేరుతో తెలుగులో ఆయనే విడుదల చేశాడు. కర్ణాటక లో ధీరజ్ ఎంటర్ ప్రైజెస్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఓవరాల్ గా థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ కలుపుకొని మాస్టర్ 200కోట్లకు పైగా బిజినెస్ చేసింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. వీరితో పాటు ఆండ్రియా జెర్మియా , శంతన్ భాగ్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో ఎక్స్ బి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక సర్కార్ , బిగిల్ చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్లు కావడం తో మాస్టర్ పై అక్కడ కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

Related posts

జాతీయజండా.. మగ్గంపై.. కార్మికుడి దేశభక్తి.. 5 నెలల శ్రమ..

vimala p

విజయవాడ స్లీపర్‌ బస్సు చార్జీల్లో రాయితీ

vimala p

తల్లిదండ్రులకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన యంగ్ హీరో

vimala p