telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

జనవరి 14న రానున్న మాస్టర్…

Master

భారీ అంచనాలతో మాస్టర్ సినిమా విడుదలకు సిద్దమయింది. ఈ సినిమాలో తమిళ అగ్ర నటులు విజయ్ తలపతి, విజయ్ సేతుపతి ఇద్దరు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కావాల్సింది. కానీ మహమ్మారి కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే హీరో విజయ్ తలపతి పుట్టిన రోజు కానుకగా చిత్ర యూనిట్ అభిమానులకు సినిమా ట్రైలర్ విడుదల చేసి కనుల పండగ చేసింది. ఈ చిత్రం కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు భారీ స్పందన పొందాయి. ఈ సినిమాను థియేటర్లో విడుదల చేస్తేనే ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించగలుగుతామని తమిళ థియేటర్ల యాజమాన్యం అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ కూడా అనూహ్య ఆదరణ పొందడమే కాకుండా అనే రికార్డులను సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సన్నద్దంగా ఉంది. కరోనా కారణంగా థియేటర్లు కేవలం 50శాతం ఆక్యుపెన్సీతో నడవనున్నాయి. అయితే ఈ సినిమాకు ప్రజల ఎద్దడి ఎక్కువగా ఉంటుందని, ఈ ఒక్కసారికి థియేటర్లు మామూలుగా అంటే 100శాతం ఆక్యుపెన్సీతో నడుపుకునేందుకు అనుమతి కోసం హీరో విజయ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో వచ్చే నెల జనవరీ13న విడుదల కానుంది. హిందీలో జనవరీ 14న రిలీజ్ అవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు తారాస్థాయిని మించి ఉన్నాయి.

Related posts