telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

మాల్యాపై ఇప్పటికే దివాలా ఆర్డర్: భారతీయ బ్యాంకులు

vijaya malya london

భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా ప్రయత్నాలకు అడ్డుకట్టపడినట్టు తెలుస్తోంది. ఆయన అన్నీ దారులు మూసుకుపోయాయని భారత బ్యాంకులు ఇంగ్లండ్ హైకోర్టుకు తెలిపాయి. తాము ఇప్పటికే అతడిపై దివాలా ఆర్డర్ జారీ చేశామని, కాబట్టి చెల్లింపులకు సంబంధించిన సెటిల్‌మెంట్ కోసం అతడు ముందుకొచ్చినా ఇప్పుడు ఎటువంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశాయి.

లండన్‌ హైకోర్టుకు చెందిన దివాలా విభాగంలో మాల్యాపై కేసుపై జరిగిన విచారణలో ఎస్‌బీఐ నేతృత్వంలోని 13 బ్యాంకులు తమ వాదన వినిపించాయి. రాజకీయ కారణాల మూలంగా భారత్‌లో తనకు న్యాయం జరగదన్న మాల్యా వాదనను పట్టించుకోవద్దని ఈ సందర్భంగా కోరాయి. సెటిల్‌మెంట్ ఆఫర్ కింద మాల్యా చూపిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆస్తులు అధికారిక లిక్విడేటర్ అధీనంలో ఉన్నాయని పేర్కొన్నాయి.

Related posts