telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దేవరకొండ, పూరీ మూవీ నుంచి అదిరిపోయే అప్టేట్‌

క్రేజీ స్టార్ విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం లో పాన్‌ ఇండియన్‌ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఛార్మీ కౌర్‌, కరణ్‌ జోహార్‌తో కలిసి పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ మారిందని టాక్‌. ఈ చిత్రానికి తొలుత ‘ఫైటర్‌’ టైటిల్‌ ఖాయం చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం తదితర భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండు భాషల్లో ఈ టైటిల్‌ దొరకలేదట. అయితే… తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్టేట్‌ వచ్చింది. సోమవారం ఉదయం 10:08 గంటలకు టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయనున్నట్లు ఈ సినిమా బృందం ప్రకటించింది. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. అన్ని భాషలకు అతీతంగా అందరినీ అలరించేందుకు ఈ మూవీ రెడీ అవుతోంది అని చిత్ర బృందం తెలిపింది. కాగా.. ఈ మూవీలో అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే..

Related posts