telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండపై వ్యాఖ్యలు… బాలీవుడ్ నటుడికి ఆనంద్ కౌంటర్

Vijaydevarakonda

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఇటీవల రాజకీయాలపైన చేసిన వ్యాఖ్యలకు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ కి చెందిన గుల్షన్‌ అనే నటుడు విజయ్ కామెంట్స్ పట్ల అసహనం వ్యక్తం చేశాడు. ‘తలలో ఉన్న ఒత్తిడిని కొంతమేర తగ్గించుకోవడానికి మీకు ఓ హెయిర్‌కట్‌ సూచిస్తా’ అని కామెంట్ పెట్టాడు. అయితే ఈ కామెంట్ పట్ల విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ స్పందించాడు. ‘తెలివైన వారు ఎవరైనా.. ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడారో ముందు అర్థం చేసుకుంటారు. అంతేకానీ సదరు వ్యక్తి గురించి సోషల్‌మీడియా వేదికగా వ్యక్తిగత కామెంట్లు చేయరు’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మొదలై అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే సినిమాని చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరొనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చార్మీ రూపొందిస్తున్నారు. సినిమాని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.

Related posts