telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ న్యూలుక్ వైరల్

Vijay-Devarakonda

“పెళ్లి చూపులు” సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఆ త‌ర్వాత “అర్జున్ రెడ్డి”తో ఫేట్‌నే మార్చుకున్నాడు. దేశవ్యాప్తంగా ఆయ‌న‌కి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ సినిమా త‌ర్వాత “గీత గోవిందం”, “ట్యాక్సీవాలా” చిత్రాలు విజ‌య్‌కి మంచి విజ‌యం అందించాయి. ప్ర‌స్తుతం “హీరో” అనే సినిమా చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తన తొమ్మిద‌వ సినిమాగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు. “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” డైరెక్టర్ క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయ్యింది. ఈ చిత్రానికి “వరల్డ్ ఫేమస్ లవర్” అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కాగా… యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ లుక్‌తో ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నారు. తన ఫ్యాషన్ బ్రాండ్ ‘‘రౌడీ వేర్’’ కోసం చేసిన ఫొటోషూట్ స్టిల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. తన యాటిట్యూడ్‌తో యూత్‌లో బలమైన ముద్రను వేసిన విజయ్ దేవరకొండ ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్‌తో స్టైయిల్ స్టేట్మెంట్‌గా మారాడు. ప్రత్యేకత, నాణ్యత, భారతీయతను మేళవించి రౌడీ బ్రాండ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసింది. ఒక సెలబ్రిటీ ఇమేజ్‌తో నడుస్తున్న తొలి బ్రాండ్ ఇదే కావడం విశేషం. తన స్టైయిల్ స్టేట్‌మెంట్స్‌తో తన ప్యాషన్ అభిరుచితో రౌడీ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రౌడీ బ్రాండ్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్‌లోకి కూడా తన మార్క్ ని చూపబోతుంది. త్వరలోనే విస్తరించబోతున్న ‘స్ట్రీట్ వేర్’ బ్రాండ్.. విజయ్ స్కెచ్‌లతో ఫుట్ వేర్ రంగంలో కొత్త వాయిస్‌గా మారబోతోంది.

Related posts