• Home
  • వార్తలు
  • క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ‌లో… విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క్రాంతిమాధ‌వ్ చిత్రం.. 
వార్తలు సినిమా వార్తలు

క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ‌లో… విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క్రాంతిమాధ‌వ్ చిత్రం.. 

Vijay Deverakonda, Kranthi Madhav & Creation Commercial
తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌తిష్మాత్మ‌క నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ సంస్థ‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.46 గా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా వ‌స్తోంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో ఈయ‌న చేస్తోన్న తొలి సినిమా ఇది. అక్టోబ‌ర్ 18న హైద‌రాబాద్ లో ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు ఈ చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టులు.. చిత్రానికి ప‌ని చేయ‌నున్న సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివ‌రాలు చిత్ర‌యూనిట్ తెలియ‌జేయ‌నుంది. ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. జేకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత కేఎస్ రామారావు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని కేఎ వ‌ల్ల‌భ నిర్మిస్తున్నారు. 
న‌టీన‌టులు: 
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా,ఐశ్వ‌ర్యా రాజేష్,ఇసాబెల్లె డి
సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: క‌్రాంతి మాధ‌వ్
స‌మ‌ర్ప‌కుడు: కేఎస్ రామారావు
నిర్మాత‌: కేఎ వ‌ల్ల‌భ‌
నిర్మాణ సంస్థ: క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్
సంగీతం: గోపీసుంద‌ర్
సినిమాటోగ్ర‌ఫర్: జేకే
ప్రొడ‌క్ష‌న్ డిజైన్: సాహీ సురేష్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Related posts

బిగ్ బాస్ కి వెళ్లి అందాన్ని పెంచుతుంది… ప్రేక్షకుల కామెంట్స్

jithu j

దర్శకులు వి.వి.వినాయక్ విడుదల చేసిన  “బిచ్చగాడా మజాకా” థియేట్రికల్ ట్రైలర్!!

chandra sekkhar

రేపే ''నా' పేరు సూర్య'…

admin

Leave a Comment