telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ : పోలీసులకు విజయ్ దేవరకొండ క్షమాపణలు

Vijay-Devarakonda

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో భారీ క్రేజ్ ఉంది. దీంతో విజయ్ ఏం చేసినా వైరల్ గా మారుతోంది. అంతేకాదు అభిమానులు చేసే కొన్ని పనులు కూడా విజయ్ కు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. తన ఇమేజ్ తో రౌడీ పేరుతో ఓ బట్టల బ్రాండ్ ను మార్కెట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. రౌడీ పేరుతో వస్తున్న ఈ బట్టలు యూత్ ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొంతమంది రౌడీ బ్రాండ్ ను బైక్ నంబర్ ప్లేట్లపైకి కూడా ఎక్కిస్తూ చట్ట రీత్యా చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఇద్దరు యువకులు బుల్లెట్ పై వెళ్తున్నారు. కానీ ఆ బైక్ నెంబర్ ప్లేట్ కు నెంబర్ లేదు… “రౌడీ” అని రాసి ఉంది. అది చూసిన ట్రాఫిక్ పోలీసులు వీళ్ళను ఆపి ఫైన్ వేశారు. అంతేకాకుండా రౌడీ బండిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మీ నెంబర్ ప్లేట్ ను నిబంధనలకు అనుగుణంగా ఫిక్స్ చేసుకోవాలి.. అందుకు విరుద్ధంగా ఉంటే CMV Rule 50 & 51 కింద జరిమానా విధించటం జరుగుతుంది. దీనిపై ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తాం అని ప్రకటించారు.

ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పేజీలో స్పందించారు. తన అభిమానుల తరఫున తాను క్షమాపణలు తెలిపాడు. అభిమానులను తను కుటుంబ సభ్యులుగా భావిస్తానని, దయచేసి నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి కష్టాల్లో పడొద్దని హితవు పలికాడు. మీ ప్రేమను నంబర్ ప్లేట్లపై చూపించాల్సిన అవసరంలేదని, నంబర్ ప్లేట్లను నంబర్ కోసమే ఉపయోగించాలని తన అభిమానులకు సూచించారు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts