telugu navyamedia
సినిమా వార్తలు

“వరల్డ్ ఫేమస్ లవర్”గా విజయ్ దేవరకొండ

WFL

“పెళ్లి చూపులు” సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఆ త‌ర్వాత “అర్జున్ రెడ్డి”తో ఫేట్‌నే మార్చుకున్నాడు. దేశవ్యాప్తంగా ఆయ‌న‌కి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ సినిమా త‌ర్వాత “గీత గోవిందం”, “ట్యాక్సీవాలా” చిత్రాలు విజ‌య్‌కి మంచి విజ‌యం అందించాయి. ప్ర‌స్తుతం హీరో అనే సినిమా చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తన తొమ్మిద‌వ సినిమాగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు . ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ డైరెక్టర్ క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయ్యింది. కానీ ఇంతవరకు ఈ సినిమా పేరు అనౌన్స్ చెయ్యలేదు. తాజాగా చిత్ర టైటిల్ అనౌన్స్ చేశాడు. “వరల్డ్ ఫేమస్ లవర్” అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ ఫ‌స్ట్ లుక్‌ని సెప్టెంబ‌ర్ 20 సాయంత్రం 5గం.ల‌కి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అధికభాగం పారిస్‌లో షూట్ చేశారు. మిగిలిన షూటింగ్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ గడ్డం పెంచుకుని హార్ట్ బ్రేక్ అయిన ఒక ఫెయిల్యూర్ లవర్‌లా క‌నిపిస్తాడ‌ని టాక్.

Related posts