వార్తలు సినిమా వార్తలు

‘విజయ్ దేవరకొండ’కు కొత్త టార్గెట్… సక్సెస్ కాకపోతే అంతా మటాష్

vijay devarakonda

దర్శక నిర్మాతలకు బంగారు కొండగా మారిన విజయ్ దేవర కొండ మూడంటే మూడు సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఫేమ్ ను సంపాదించుకున్నాడు… పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, తాజాగా విడుదలై ప్రేక్షకులను ఎంతగానో అలరించిన గీత గోవిందం చిత్రాలతో యూత్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం ఈ హీరోకు ఉన్నంత డిమాండ్ మరే ఇతర హీరోకు లేదంటే కూడా ఆశ్చర్య పోవాల్సింది లేదు…. ఇతనితో ఒక సినిమా చేయాలంటే 10 కోట్ల రెమ్యునేషన్ ఇయ్యడానికైనా నిర్మాతలు ఈజీగా ఒప్పుకుంటున్నారు.. మాతో తీయండి అంటే మాతో తీయండి అంటూ విజయ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు…

Vijay Devarakonda will Top League Star List Soon

ఇటీవల కాలంలో మూడు సినిమాలతోనే ఇంత గొప్ప పేరు రావడం విజయ్ కి మాత్రమే దక్కిందని చెప్పుకోవాలి.. సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా అందరు స్టార్ హీరోలు 60 కోట్లనుంచి 120 కోట్ల క్లబ్ లలో ఉన్నారు.. ప్రస్తుతం గీత గోవిందం సినిమా అనంతరం విజయ్ కూడా 60 కోట్ల క్లబ్ లో చేరడంతో రానున్న రెండు సినిమాలు (టాక్సీ వాలా, నోటా)

Vijay Devarakonda will Top League Star List Soon

మరో 30, 40 కోట్ల షేర్లు గనక సాధించగలిగితే కేవలం ఐదు సినిమాల ద్వారానే విజయ్ టాప్ లీగ్ స్టార్స్ లిస్ట్ లో స్థానం దక్కించుకుంటాడు… ఖచ్చితంగా విజయ్ ఆ టార్గెట్ ని రీచ్ అయితాడు లిస్ట్ లో చేరతాడు అని అభిమానులు కుండలు బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు…

Vijay Devarakonda will Top League Star List Soon

మరి రానున్న ఆ రెండు సినిమాలు ఎంతవరకు విజయం సాదిస్తాయో వేచి చూడాల్సిందే…

Related posts

వైసీపీలోకి.. ‘కత్తి’.. సీటు ఖాయం…

chandra sekkhar

కిడారి, సోమల కదలికలపై..మావోలకు సమాచారం ఇచ్చింది బంధువులే!

madhu

ఒకడు వేధిస్తుంటే.. మరొకడు అక్కడ అలా పట్టుకొని… ఎన్నో బాధలు.. పూజ

nagaraj chanti

Leave a Comment