telugu navyamedia
సినిమా వార్తలు

షాకింగ్… విజయ్ దేవరకొండ స్టేజిపై మాట్లాడుతుండగానే…!!?

Vijay-Devarakonda

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌ బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్న ఎమోష‌న‌ల్ డ్రామా “డియ‌ర్ కామ్రేడ్‌”. “యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌” ట్యాగ్ లైన్‌. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. “డియర్‌ కామ్రేడ్‌” సినిమాలో హీరోయిన్ ర‌ష్మికా మంద‌న్న‌ క్రికెట‌ర్‌గా న‌టించింది. సామాజిక బాధ్య‌త ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మెప్పించ‌నున్నారు. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందిస్తుండ‌గా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. “డియర్ కామ్రేడ్‌” ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శృతి రామచంద్రన్, సుహాస్, చారు హాసన్, ఆనంద్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ శుక్రవారమే గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అన్ని భాషల్లో తనదైన శైలిలో ప్రమోషన్లు చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. తాజాగా విజయ్ దేవరకొండకు ఆయన అభిమాని షాక్ ఇచ్చాడు. “డియ‌ర్ కామ్రేడ్” సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లో ఆయ‌న మాట్లాడుతుండ‌గా ఉన్న‌ట్లుండి ఓ అభిమాని దూసుకొచ్చి, విజ‌య్ కాళ్ల‌పై ప‌డ్డాడు… అత‌డి కాళ్ల‌ను గ‌ట్టిగా ప‌ట్టేసుకున్నాడు. అనుకోకుండా జ‌రిగిన ఘ‌ట‌న చూసి ఒక్క‌సారిగా షాక్ అయ్యాడు విజ‌య్. తేరుకోడానికి కూడా స‌మ‌యం తీసుకున్నాడు ఈ హీరో. వెంట‌నే సెక్యూరిటీ సిబ్బంది అత‌న్ని తీసుకొని ప‌క్క‌కు లాక్కెళ్లారు.ఈ ఘటనపై స్పందించిన విజయ్ “ఎంట్రా అది.. ప్రేమనుకోవాలా లేదంటే అటాక్ చేసిన‌వ‌నుకోవాలా…” అంటూ సెటైర్లు వేసాడు విజ‌య్. త‌ర్వాత సెక్యూరిటీ కూడా ఆ కుర్రాన్ని ప‌ట్టుకుంటుంటే వ‌ద్దు వ‌దిలేయండి అంటూ చెప్పాడు విజ‌య్.

Related posts