telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఎస్ఆర్ కళ్యాణమండపం టీజర్ రిలీజ్ విడుదల చేసిన రౌడీ హీరో…

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల నుంచి పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్, రిలీజ్ డేట్ అంటూ ఏదోఒక అప్‌డేట్ ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాకుండా ఈ అప్‌డేట్‌లతో సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నారు. ఇక అదే దారిలో మరో సినిమా నుండి కూడా ఓ అప్డేట్ వచ్చింది. అయితే తాజాగా అబ్బవరం కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా టీజర్ విడుదలైంది.  ఈసినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా నటించారు. అంతేకాకుండా ఈ సినిమా టీజర్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ‘ఏ అన్నో మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా’ అంటూ మొదలయ్యే టీజర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాను శ్రీధర్ దర్శకత్వంలో ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుంని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తుంది. ఈ టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది.. ఎంత మేర వసూళ్లు సాధిస్తుంది అనేది చూడాలి మరి.

Related posts