telugu navyamedia
సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్” టాక్ పై విజయ్ దేవరకొండ రియాక్షన్

Dear-Comrade

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం “డియర్ కామ్రేడ్”. తాజాగా ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తొలి రోజే ఈసినిమా ఓవరాల్‌గా వాల్డ్ వైడ్‌గా రూ.10 కోట్ల షేర్ వసూలు చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాపై వస్తున్న వార్తలకు తనదైన శైలిలో స్పందించాడు. ఈ సినిమా చూడాలంటే ఎంతో ఓపిక ఉండాలి. “ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. బాబీ, లిల్లీల జర్నీ ఇది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేసిన నేనే ఈ సినిమా చూసి ఏడ్చేసాను అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. మరోవైపు ఈ సినిమా కొన్ని చోట్ల బోరింగ్ ఉన్న విషయాన్నికూడా ఒప్పుకున్నాడు. ఈసినిమా చేయడానికి నాకు గర్వంగా ఉందన్నారు. ఈ సినిమా పూర్తైయిన తర్వాత ఈ చిత్ర యూనిట్‌‌‌తో ఉన్న అనుబంధాన్ని మరవలేకపోతున్నారు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్‌లో నేను మరో సినిమాచేయబోతున్నానని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి “డియర్ కామ్రేడ్” సినిమాపై వస్తోన్న విమర్శలకు తనదైన శైలిలో స్పందించాడు. ఈ సినిమా రివ్యూలు చదువుతుంటే చాలా సంతోషమేసింది. మరోవైపు ఈ సినిమాలో భాగస్వామ్యమైనందకు చాలా గర్వంగా ఉందని తెలిపారు.

Related posts