సినిమా వార్తలు

రేటు పెంచిన విజయ్ దేవరకొండ

vijay devarakonda

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం “గీతగోవిందం”. ఇటీవలే ఈ సినిమా విడుదలై అద్భుతమైన ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది కూడా. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం “గీతగోవిందం”. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా యూత్ లో విజయ్ దేవరకొండ అంటే ఉన్న క్రేజ్ కూడా సినిమా విజయానికి దోహదపడింది. ఇక సినిమాలోని పాటలు, విజయ్, రష్మిక జంట కూడా అందంగా ఉండడం సినిమా విజయానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. సినిమా విజయంతో చిత్ర యూనిట్ మొత్తం ఆనందంలో మునిగి తేలుతోంది.

ఇక 10 కోట్లతో తెరకెక్కిన “గీతగోవిందం” 100 కోట్ల కలెక్షన్లను సాధించడంతో విజయ్ దేవరకొండ 100 కోట్ల క్లబ్బులో చేరిపోయాడు. దీంతో ఈ క్రేజీ హీరో తన రెమ్యునరేషన్ ను కూడా పెంచాడట. అయితే ఎంత పెంచాడనే సమాచారం మాత్రం లేదు. “అర్జునరెడ్డి” విజయం తరువాత కూడా విజయ్ తన రెమ్యూనరేషన్ ను పెంచారు. ఇక ప్రస్తుతం హిట్ ను అందించిన “గీతగోవిందం” చిత్రానికి 10 కోట్ల పారితోషికాన్ని అందుకున్నాడట. మరి ఇప్పుడు మళ్ళీ పారితోషికాన్ని పెంచడంతో నిర్మాతలెవరూ ఆశ్చర్యపోవట్లేదు… పైగా సినిమాలు మంచి బిసినెస్ చేసినప్పుడు నటీనటులు తమ రెమ్యూనరేషన్ ను పెంచడం మాములే అని నిర్మాత తెలియజేశారు. మరి తన తరువాత సినిమాలు కూడా ఇలాగె భారీ హిట్ ను అందుకుంటే విజయ్ ఖచ్చితంగా టాప్ హీరోల జాబితాలో చేరతాడు.

Related posts

ప్రభుదేవా "లక్ష్మీ" టీజర్

admin

ఈ టాలీవుడ్ సెలబ్రిటీలను గుర్తుపట్టారా ?

admin

మహేష్ అభిమానులకు డబుల్ బొనాంజా..

admin

Leave a Comment