telugu navyamedia
సినిమా వార్తలు

మినిమమ్ బాలన్స్ లేవని అకౌంట్ క్లోజ్ చేశారు : విజయ్ దేవరకొండ

Vijay Devarakonda

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా చేసిన ట్వీట్ హల్చల్ చేస్తోంది. “అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ ఉందనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రౌడీ హీరో ఫోర్బ్స్ లిస్ట్ లో స్థానం సంపాదించాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఓ విషయం పంచుకున్నాడు. ”నాకు 25 ఏళ్ల వయసున్నప్పుడు రూ.500మినిమం బ్యాలన్స్ మైంటైన్ చేయకపోతే అకౌంట్ లాక్ చేసిన్రు.. అప్పుడు నాన్న ముప్పై వచ్చేలోపు బాగా సెటిల్ కావాలని, తల్లితండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యువకుడిగా ఉన్నప్పుడే సక్సెస్ ని ఎంజాయ్ చేయగలవని అన్నారు. నాలుగేళ్ల తరువాత ఫోర్బ్స్ సెలబ్రిటీల స్థానంలో చోటు సంపాదించాను” అంటూ ట్వీట్ చేశాడు విజయ్. ఇక ప్రస్తుతం విజయ్ నటిస్తున్న “డియర్ కామ్రేడ్” చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

Related posts