telugu navyamedia
telugu cinema news

కొత్త దర్శకుడికి విజయ్ దేవరకొండ ఆఫర్

Vijay-Devarakonda

“అర్జున్‌రెడ్డి”తో స్టార్ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ “గీత‌గోవిందం”తో వంద‌కోట్ల రూపాయ‌ల హీరోగా మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయడానికి చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కంటెంట్ బావుంటే కొత్త‌, పాత అని బేదం చూడ‌కుండా అంద‌రి ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డానికి విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ కొత్త ద‌ర్శ‌కుడికీ ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చారు ఈ క్రేజీ హీరో. “దొర‌సాని” ప్రీ రిలీజ్ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన విజ‌య్ ఆ చిత్ర ద‌ర్శ‌కుడు కె.వి.ఆర్‌.మహేంద్రను అభినందించారు. తాను సినిమా చూశాన‌ని, మ‌హేంద్ర సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించార‌ని, త‌న‌కోసం మ‌హేంద్ర ఓ క‌థ‌ను త‌యారు చేసుకుంటున్న‌ట్లు త‌న‌కు తెలిసింద‌ని, స్క్రిప్ట్ రెడీ అయిన త‌ర్వాత ఓసారి క‌థ‌ను చెబితే తాను విన‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు స్టేజ్‌పైనే ప్ర‌క‌టించారు. దొర‌సానిలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌ను డైరెక్ట్ చేసిన మ‌హేంద్ర రెండో సినిమాకే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేసే ఆఫర్ రావడం అనేది ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

Related posts

ప్రకాశ్‌రాజ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు

vimala p

చెన్నై ఇంటికి చేరుకున్న బాలు పార్థివదేహం

vimala p

నాగచైతన్య, సాయి పల్లవిల “లవ్ స్టోరీ”

vimala p