telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ “బ్రేకప్” ?

Vijay-Devarakonda

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధ‌వ్ సినిమాపై దృష్టి పెడుతున్నాడు. మ‌రో ప‌క్క ఈ యువహీరో న‌టించిన “డియ‌ర్ కామ్రేడ్” పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. దీంతో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ హీరో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్లేబోయ్‌గా క‌న‌ప‌డ‌బోతున్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రానికి “బ్రేక‌ప్‌” అనే టైటిల్‌ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు ముగ్గురు హీరోయిన్లతో బ్రేకప్ అవుతుందట. చివరకు ఓ హీరోయిన్ ను పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోతాడట. ఈ చిత్రంలో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, ఇజా బెల్లి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

Related posts