telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ ఖాతాలో అరుదైన రికార్డు… సౌత్ హీరోల్లోనే టాప్

Vijay-Devarakonda

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ బయటే కాదు సోషల్‌మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. విజయ్ తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్ల ఫాలోవర్స్‌ సాధించుకున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 9 మిలియన్ల ఫాలోవర్స్‌ని కలిగిన ఏకైక హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. దక్షిణాది ఏ హీరోకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్న తమ అభిమాన హీరోని చూసి అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. విజయ్ దేవరకొండ 2018, మార్చి 7న త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ప్రారంభించారు. ఇంత త‌క్కువ వ్యవధిలోనే 9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకోవడం అరుదైన విషయమే. ఇక రౌడీ బ్రాండ్‌‌తో కొంతకాలం క్రితం ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టిన ఆయన యూత్‌కి ఐకాన్‌గా మారిపోయాడు. విజ‌య్ ప్రస్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో `ఫైట‌ర్‌` సినిమాలో నటిస్తున్నాడు. డైరెక్టర్‌ సుకుమార్‌‌తో చేసే క్రేజీ ప్రాజెక్టుపై కొద్దిరోజుల క్రితమే ప్రకటన వెలువడింది.

Related posts