telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయదేవరకొండ బైక్ రేసర్ గా … కొత్త అవతార్..

Vijay-Devarakonda

యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే దాదాపుగా ఎక్కువమంది నోటి నుండి వచ్చే పేరు విజయ్ దేవరకొండ. ఇప్పటికే అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సూపర్ హిట్స్ తో తన క్రేజ్ మరియు మార్కెట్ ని అమాంతం పెంచేసుకున్న ఈ రౌడీ హీరో, ఇప్పటికే భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని రెండు పాటలు ఇటీవల యూట్యూబ్ లో విడుదలై సినిమాపై మంచి హైప్ తీసుకువచ్చాయి. ఈ సినిమా అనంతరం విజయ్ మరొక సినిమాను త్వరలో ప్రారంభించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రముఖ రచయిత అన్నామలై ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఇప్పటికే విజయ్ తో డియర్ కామ్రేడ్ నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ ఒక బైక్ రేసర్ గా నటించనున్నట్లు చెపుతున్నారు.

ఒక మంచి సందేశంతో పాటు, క్రీడా నేపథ్యం ఉన్న ఈ సినిమా విడుదల తరువాత విజయ్ క్రేజ్ మరింత పెరుగుతుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాని ఈ నెల 20వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ లో పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల గురించిన తదితర వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడికానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంచి జోష్ తో దూసుకుపోతున్న విజయ్ కు ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందిస్తే, అయన క్రేజ్ మరింత పెరగక మానదు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు….!!

Related posts