telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్, అట్లీ చిత్రం… భారీ రేటుకు అమ్ముడైన శాటిలైట్ రైట్స్

Vijay

అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ తన 63వ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా క్రింద నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడట. గతంలో అట్లీ కుమార్, విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన “తేరి, మెర్సల్” చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు. దీంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా శాటిలైట్ హక్కుల విషయంలో భారీ పోటీ నెలకొంది. చివరికి ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ వారు దక్కించుకున్నారని తెలుస్తోంది. సన్ టీవీ అన్ని భాషల్లో కలిపి ఈ హక్కుల్ని 60 కోట్లకు దక్కించుకుందట. శాటిలైట్ హక్కుల పరంగా కోలీవుడ్లో ఇంతవరకూ అత్యధిక రేటుకు అమ్ముడైన సినిమా ఇదేననేని టాక్. నయనతార ఈ చిత్రంలో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నారు.

Related posts