telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న “శకుంతలా దేవి” ట్రైలర్

Shakunthala-devi

విద్యాబాలన్ కథానాయికగా.. హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న “శకుంతలా దేవీ” సినిమా ట్రైలర్ విడుదలైంది. అను మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ విక్రమ్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమా నిర్మాతలు ఓటీటీలో చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయాలని అని నిర్ణయించుకున్నారని సమాచారం. శకుంతలా దేవీ చిత్రం జూలై 31న విడుదల కానుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన అద్భుతమమైన “కాలిక్యులేషన్ మైండ్” వల్ల ప్రసిద్ధి చెందిన శకుంతలా దేవీ పాత్రలో విద్యాబాలన్ ఇమిడిపోయారు. శకుంతలా దేవీ ట్రైలర్ 2 నిమిషాల 47 సెకన్లు ఉంది. ఇక రెండు నిముషాల నలభై సెకండ్స్ ఉన్న చిత్రం ట్రైలర్ ఓ వైపు ఆద్యంతం వినోదాత్మకంగా.. మరోవైపు ఎమోషనల్ గాను ఉంది. శకుంతలా దేవీ “హ్యూమన్ కంప్యూటర్”‌గా ఎలా పేరు సంపాదించుకుంది అనేది ట్రైలర్‌లో చూపించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

Related posts