telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఒప్పందం ఉల్లంఘించిన పాక్ .. పైలెట్ ను హింసింస్తున్న వీడియో విడుదల.. భారత్ హెచ్చరిక !!

pak will lose if war declared with india

నిన్న పాక్ యుద్ధవిమానాలను వెనక్కు పంపేందుకు దాడిచేస్తూ, ప్రమాదానికి గురైన ఒక భారత యుద్ధ విమాన పైలెట్ శత్రుదేశానికి బందీగా దొరికిన విషయం తెలిసిందే. అతడిని జెనీవా ఒప్పందం ప్రకారం జాగర్తగా తిరిగి భారత్ కి అప్పగించాల్సి ఉంది. కానీ అతడిని హింసిస్తున్న వీడియో సామజిక మాధ్యమాలలో హాల్ చల్ చేస్తుంది. దీనితో భారత్ ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇప్పటికే సదరు పైలెట్ ను ఒప్పందం ప్రకారం 7 రోజులలో భారత్ కు అప్పగించకపోతే అధికారికంగా యుద్ధం ప్రకటించినట్టే అంటూ ప్రధాని మోడీ హెచ్చరించిన విషయం తెలిసిందే.

అసలు జెనీవా ఒప్పందం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం :

యుద్ధ సమయంలో వైరిపక్షానికి పట్టుబడిన సైనికులు, పౌరులందరినీ ‘యుద్ధఖైదీలు..(ప్రిజనర్‌ ఆఫ్‌ వార్‌ – పీఓడబ్ల్యూ) అనే అంటారు. యుద్ధ క్షేత్రంలో గాయపడి లేదా క్షతగాత్రులై పట్టుబడిన వీరికి ఎటువంటి రక్షణ కల్పించాలి? వీరికి ఎలాంటి హక్కులు ఉంటాయన్నది ఒప్పందాల్లో స్పష్టంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం 1949 కుదిరిన ఈ ఒప్పందాల మీద దాదాపు 196 దేశాలు సంతకాలు చేశాయి, తర్వాతి కాలంలో దీన్ని మూడు సార్లు సవరించారు.

ఒప్పందం 1

గాయపడిన, నిలకడగా లేని సైనికులకు రక్షణనిచ్చే ఒడంబడిక ఇది. దీనికి ప్రకారం జాతి, మత, లింగ, ప్రాంత వివక్షలకు తావు లేకుండా ఆ సైనికులు ఎవరైనా సరే, వారికి మానవతా దృక్పథంతో సాయం అందించాలి. వారి పట్ల మానవత్వంతో స్పందిస్తూ.. వారిని హింసించటం, దాడులు చేయటం వంటివేమీ చెయ్యకూడదు, సరైన న్యాయ విచారణ, తీర్పు లేకుండా వారికి మరణదండనతో సహా ఎలాంటి శిక్షలూ విధించకూడదు. పైగా వారికి సంపూర్ణ వైద్య సహాయం, చికిత్స అందిస్తూ రక్షణగా నిలబడాలని కూడా ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది.

ఒప్పందం 2

ఇది సముద్రాల్లో పట్టుబడిన నౌకాదళ సైనికులకు సంబంధించినది. వారికి ఓడల్లోనే వైద్యసహాయం అందించాలని, లేదా ‘ఆసుపత్రి ఓడ’లకు తరలించాలని ఇది స్పష్టం చేస్తోంది.

ఒప్పందం 3

యుద్ధ ఖైదీ అంటే ఎవరు? వారి నుంచి ఏయే సమాచారం రాబట్టవచ్చన్నది స్పష్టంగా నిర్వచించే ఒప్పందం ఇది. దీని ప్రకారం యుద్ధఖైదీలను బందీలుగా తీసుకున్న దేశం- వారి నుంచి కేవలం వారి పేరు, సైన్యంలో వారి ర్యాంకు, నంబరు మాత్రమే తెలుసుకోవాలని స్పష్టంగా సూచిస్తోంది. అంతేగానీ శత్రుదేశానికి సంబంధించిన సమాచారం రాబట్టేందుకు వారిని హింసించటం, శారీరకంగా మానసికంగా వారిని హింసలకు గురి చేయటం తగదని స్పష్టంగా నిర్దేశిస్తోంది.

ఒప్పందం 4

యుద్ధంలో పట్టుబడిన పౌరులకు కూడా సైనికుల మాదిరిగానే అన్ని రక్షణలూ కల్పించాలని, వారి పరిస్థితిని బట్టి అవసరమైన సపర్యలు అందించాలని స్పష్టం చేస్తోందీ ఒప్పందం.

Related posts