telugu navyamedia
telugu cinema news trending

ఎన్టీఆర్ ‘వయస్సునామీ’ సాంగ్ కు జపనీస్ జంట డాన్స్… వీడియో వైరల్

NTR

ఎన్టీఆర్ ‘కంత్రి’ సినిమాలోని ‘వయస్సునామీ’ అంటూ సాగే పాటకు ఓ జపనీస్ జంట డ్యాన్స్ చేసింది. ఇంటిని శుభ్రం చేస్తున్నట్టుగా ఈ పాటను కొరియోగ్రఫీ చేశారు. ఆ పాటలో ఎన్టీఆర్, హన్సిక ఎలా అయితే డ్యాన్స్ చేశారో అలాగే ఈ జంట కూడా దించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అతని పేరు హిరో మునీరు (Hiro Munieru). జపనీస్ కాస్ట్యూమ్ డిజైనర్, ఫొటోగ్రాఫర్. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. జపాన్‌కు చెందిన ఈ జంట రెండు నెలల క్రితం ‘అశోక్’ సినిమాలోని ‘గోల గోల’ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు. ఎన్టీఆర్, సమీరా రెడ్డి చేసినట్టుగానే పాటలు ఉన్న స్టెప్పులను దించేశారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. ఆ తరవాత ‘సింహాద్రి’లోని ‘చీమ చీమ’ పాటకు కూడా ఈ జంట డ్యాన్స్ చేసింది.

Related posts

ప్రత్యేక రైళ్లు : .. సికింద్రాబాద్ నుండి పలు మార్గాలకు .. 76 రైళ్లు.. రద్దీ దృష్ట్యా..

vimala p

ఇళయరాజాపై నిర్మాత కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్ సంచలన వ్యాఖ్యలు

vimala p

బాలయ్య అభిమానులకు దీపావళి ట్రీట్

vimala p