telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో కరోనా కంట్రోల్‌నే ఉంది..

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినేట్ కార్యదర్శి డా. రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం పెద్ద స్ధాయిలో నిఘా ఉండాలని..అలాగే వ్యాక్సినేషన్ తదితర చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రాజీవ్ గౌబ తెలిపారు. తెలంగాణలో కరోనా పూర్తి స్ధాయిలో అదుపులో ఉందని కేంద్ర కేబినేట్ సెక్రటరీకి తెలిపారు సీఎస్ సోమేశ్ కుమార్. రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు 0.43 శాతం ఉందని ప్రతి రోజు 200 లోపు కేసులు నమోదు అవుతున్నాయని, ఇది చాలా తక్కువ అని అన్నారు. రాష్ట్రంలో 1100 లోకేషన్లలో ర్యాపిడ్ ఆంటిజెన్ పరీక్షలు నిర్వహించడం వలన రాష్ట్రంలో కేసుల సంఖ్యను, కరోనాను నియంత్రించడం సాధ్యమైందని, ఎవరికైన పాజిటివ్ వస్తే వెంటనే మెడిసిన్ కిట్స్ ను అందిస్తున్నామని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ కు సంబంధించి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటికే 75 శాతం మంది హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వ్యాక్సినేషన్ ఇచ్చామని, వచ్చేనెల 1 తేదిన ప్రారంభమయ్యే మూడవ విడత వ్యాక్సినేషన్ కు సిద్ధంగా ఉన్నామని సీఎస్ తెలిపారు.

Related posts