telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: విడదల రజని

MLA-Rajini-Vidadala ycp

సీఎం జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని అన్నారు. జగన్ వైఖరిని విశ్లేషించడం ఎవరి వల్ల కావడంలేదని ఆమె వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం మద్యనిషేధం దిశగా కృషి చేస్తోందని విడదల రజని స్పష్టం చేశారు.

గాంధీ జయంతి రోజు కూడా మద్యం అమ్మడం ఏంటో అర్థంకావడంలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పై ఆమె స్పందించారు. గాంధీ జయంతి రోజు మద్యం షాపులు ఎక్కడ తెరిచారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Related posts