telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పూరీ దర్శకత్వంలో వెంకటేష్ ?

Venky-Mama

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాద్ ప్రస్తుతం క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో పాన్ ఇండియన్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. “ఫైటర్” అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ జరుగుతోంది. విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సినిమా తరవాత పూరీ మహేష్ బాబు తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడని టాక్ . ఇదిలా ఉంటే విక్టరీ వెంకటేష్ తో పూరీ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. వీరిద్దరి కాంబోలో గతంలోనే ఒక సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబో మూవీ గురించి మరోసారి వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన పూరీ.. వెంకటేష్ కోసం ఒక స్టోరీని సిద్ధం చేసాడని తెలుస్తుంది. వెంకీకి ఈ కథ వినిపించడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. పూర్తి వివరాలు అతి త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

Related posts