telugu navyamedia
సినిమా వార్తలు

గాయంతోనే షూటింగ్ కు వెంకీ మామ

Venkatesh

విక్ట‌రీ వెంక‌టేష్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో బాబీ ద‌ర్శ‌క‌త్వంలో “వెంకీ మామ” అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కి చేరుకుంది. అతి త్వ‌ర‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవ‌ల మేళాలో 500మంది జూనియ‌ర్ ఆర్టిస్ట్స్‌తో పాటు ఫైట‌ర్స్‌తో భారీ యాక్ష‌న్ సీన్‌ని తెర‌కెక్కించారు. రామ్ ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో రూపొందిన‌ ఈ ఫైట్ సీక్వెన్స్‌లో వెంకటేష్ కాలికి స్వల్పంగా గాయమైంది. దీంతో యూనిట్ భయాందోళనకు గురైంది. గాయం మ‌రి పెద్ద‌ది కాక‌పోవ‌డంతో స్వ‌యంగా ఆయ‌న ఆసుప‌త్రికి వెళ్లి వైద్యం తీసుకొని తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యార‌ట‌. గాయం ఉన్నప్పటికీ, ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యే వ‌ర‌కు వ‌రుస షెడ్యూల్‌లో పాల్గొంటూ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేశాడు వెంక‌టేష్. చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. రియ‌ల్ లైఫ్‌లో మామ అల్లుళ్ళుగా ఉన్న చైతూ, వెంకీలు రీల్ లైఫ్‌లోను మామ అల్లుళ్ళుగా ఈ చిత్రంలో క‌నిపించ‌డం విశేషం. అయితే మామ‌ రైస్‌మిల్‌ యజమాని పాత్రలో సంద‌డి చేస్తే, అల్లుడు ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts