telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీయార్ ఛాలెంజ్‌ను పూర్తిచేసిన వెంకటేష్ … మహేష్, వరుణ్ లకు ఛాలెంజ్‌

venkatesh

కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరుగుతుండటంతో మన దేశంలో వచ్చే నెల మూడు వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు మినహాయిస్తే మిగతావన్ని ఎక్కడికక్కడ ఆగిపోయాయి. లాక్‌డౌన్ కారణంగా సెలబ్రిటీలు ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటున్నారు. ఎప్పుడూ ఇంట్లో వంటింటి ముఖం వైపు చూడని హీరో, హీరోయిన్లు, దర్శకులు ఇపుడు ఇంట్లో ఒక రోజు గిన్నెలు తోమి, ఇళ్లు తుడుస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన `బి ది రియల్ మేన్` ఛాలెంజ్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. స్వయంగా ఇంటి పని, వంట పని చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీయార్ నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించిన సీనియర్ హీరో వెంకటేష్ తాజాగా తన టాస్క్‌ను పూర్తి చేశారు. ఇంటిని శుభ్రం చేసి, తోట పనిచేసి, వంట చేసి ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇంటి పనిలో సహాయం చేసి నిజమైన మగాడిగా నిలుద్దామని ట్వీట్ చేశారు. అనంతరం ఈ ఛాలెంజ్ కోసం మహేష్ బాబును, వరుణ్ తేజ్‌ను, డైరెక్టర్ అనిల్ రావిపూడిని నామినేట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Related posts