telugu navyamedia
telugu cinema news trending

విశాల్ కు ఊరటనిచ్చిన హైకోర్టు

vishal

ఈనెల 21న ఒకేసారి 9 సినిమాల విడుదలకు అనుమతులిచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటూ,. ఇలా ఒకేసారి 9 సినిమాలు విడుదల కావడం వల్ల చిన్న సినిమాల నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని నిర్మాతల సంఘం కార్యాలయం ఎదుట అధ్యక్ష పదవికి విశాల్ రాజీనామా చేయాలనీ, ప్రస్తుతం ఉన్న కార్యవర్గాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు జరపాలని నిన్న కొందరు నిర్మాతలు నిరసన వ్యక్తం చేస్తూ నిర్మాతల సంఘం భవనానికి తాళం వేసి, సమీపంలోని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. కాగా గురువారం నాడు నిర్మాతల మండలి కార్యాలయానికి వేసిన తాళాన్ని పగులగొట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు విశాల్. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విశాల్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అదే సమయంలో విశాల్ నిర్మాతల మండలిలో నెలకొన్న తగాదాలను ప్రస్తావిస్తూ… గిండి తహసీల్దార్ నిర్మాతల మండలి ఆఫీసుకి సీలు వేయడంపై హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పోలిసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాతల మండలికి వేసిన సీలు వెంటనే తొలగించాలని, ఎన్ని వివాదాలున్నా అధ్యక్షుడి హోదాలో ఉన్న విశాల్ కు నిర్మాతల మండలిలోకి వెళ్ళే హక్కు ఉంటుందని తెలిపింది.

Related posts

చిన్న చికెన్ ముక్క కోసం .. స్నేహితురాలిని హత్య చేసిన యువకుడు.. !!

vimala p

ఇకపై పాకిస్థాన్ ఆర్టిస్టులపై బ్యాన్ 

ashok

గువ్వ గోరింకల్లా..

vimala p