telugu navyamedia
Sexual Problems

వయాగ్రా వాడొచ్చా ? సైడ్ ఎఫెక్ట్స్ ?

Sex-and-Psychology
నా వయస్సు 65 సంవత్సరాలు. భార్య వయ స్సు 60. మాకు నలుగురు సంతానం. ఇన్నాళ్ళూ బాధ్యతలతో దాంపత్యజీవితాన్ని సరిగ్గా ఎంజాయ్‌ చేయలేకపోయాం. ఇప్పుడు కావాల్సినంత ఏకాంతంఉంది. కానీ శృంగారంలో పాల్గొనడానికి మార్గం కన్పించడం లేదు. ఎందుకంటే అంగ స్తంభన సరిగ్గా లేదు.
ఈ వయసులో కొంతమేరకైనా శృంగారంలో సుఖాన్ని పొందవచ్చాయా ? వయాగ్రా లాంటి మందులతో ఏమైనా ఫలితం ఉంటుందా? దానివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
లైంగిక అనుభవంలో అనేది నాలుగు దశలుగా ఉంటుంది. కోరిక కలగడం, అంగస్తంభన, అంగప్రవేశం, భావప్రాప్తి. వయస్సు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో హార్మోన్‌ ఉత్పత్తి తగ్గి అంగస్తంభన, భావప్రాప్తి కలగడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. వీర్యకణాలు కూడా తగ్గుతాయి. ఈ ఇబ్బందులు కనిపిస్తే పురుషులు ఆకుకూరలు, కూరగాయలు, మినుములు తీసుకుంటే ఎక్కువగా తీసుకోవడం మంచిది. రక్తంలో టెస్టోస్టీరాన్‌ స్థాయి కోసం పరీక్ష చేయించుకోవాలి.
ఒకవేళ టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గినట్లుగా తేలితే, వైద్యుల పర్యవేక్షణలో హార్మోన్‌ ఇంజెక్షన్లు తీసుకోవాలి. మీలో లైంగిక వాంఛలు, భావప్రాప్తి బాగానే ఉండి, అంగస్తంభన, అంగం గట్టితనం సమస్యలు అధికంగా ఉంటే వైద్యుల సలహా మేరకు మాత్రమే వయాగ్రా వాడవచ్చు. అయితే వయాగ్రాకు కూడా దుష్ఫలితాలు ఉంటాయి.
వాటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా కన్పిస్తుంది. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే డాక్టర్‌ ను సంప్రదించాలి. గుండె జబ్బులు, ఇతర జబ్బులు ఉన్నవాళ్లు వయాగ్రా వాడడం ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదు. 

Related posts

చనువుగా ఉంటే అనుమానమా ?

vimala p

గర్భనిరోధక మాత్రల వాడకంతో సెక్స్ కోర్కెలు తగ్గుతాయా ?

vimala p

శృంగారానికి వేడినీళ్ళ స్నానమా ?

ashok