telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కేసీఆర్‌పై వీహెచ్‌పీ ఈసీకి ఫిర్యాదు

cm kcr red signal to 3 sitting mps

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఎన్నికల సంఘానికి విశ్వహిందు పరిషత్‌(వీహెచ్‌పీ) ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ బహిరంగ సభలో హిందువులను అవమానించేలా మాట్లాడిన కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ను కోరింది. ఆ సభలో ‘హిందూ గాళ్లు, బొందు గాళ్లు.. దిక్కుమాలిన దరిద్రుల చేతిలో దేశం ఉంది’అంటూ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యానించారని ఆ ఫిర్యాదులో పేర్కొంది.

అంతేకాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్డును కూడా కించపరిచారని, జాతీయ సమగ్రతకు భంగం కలిగేలే మాట్లాడిన కేసీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ బృందం రజత్‌ కుమార్‌కు విజ్ఞప్తి చేసింది. లిఖితపూర్వ ఫిర్యాదుతో పాటు, కేసీఆర్‌ ప్రసంగానికి సంబంధించిన సీడీని కూడా అందజేసింది. అధికారుల నుంచి నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వీహెచ్‌పీ బృందానికి రజత్‌ కుమార్‌ హామీ ఇచ్చారు.

Related posts