telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫ్రాక్‌ కా షాక్… పొట్టి గౌన్ లో 60 ఏళ్ళ నటి…!?

Neena

బాలీవుడ్ సీనియర్ నటి నీనా ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఓ ఫొటో పోస్ట్ చేశారు. తొడలు కనిపించేలా పొట్టి గౌను వేసుకుని దిగిన ఫొటో అది. దీనికి క్యాప్షన్‌గా.. ‘ఫ్రాక్‌ కా షాక్.. నా సహ నటుడు గజరాజ్ ఈ ఫొటో తీశారు’ అని పేర్కొన్నారు. ఆ గౌనులో నీనాను చూసి చాలా మంది నెటిజన్లు నిజంగా షాకయ్యారు. కొంతమందైతే ఏ వయసులో ఎలా ప్రవర్తించాలో తెలుసుకో అంటూ క్లాస్ పీకుతున్నారు. ప్రముఖ మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్, నీనా గుప్తా లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దాంతో పెళ్లికి ముందే కాస్త తొందరపడ్డారు. దాంతో నీనా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత నీనా, వీవ్ విడిపోయారు. బిడ్డను చంపుకోలేక నీనా పెంచి పెద్ద చేశారు. ఆమె ఎవరో కాదు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. పెళ్లికి ముందే బిడ్డను కన్నందుకు సమాజం ఆమెను అసహ్యించుకున్నారు. మసాబా కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. దాంతో నీనా సోషల్ మీడియాలో పెట్టే కొన్ని ఫొటోలకు అసభ్య కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ నీనా వీటి గురించి ఎప్పుడూ బాధపడలేదు. నీనా గుప్తా ఇప్పటికీ తన నటనతో సినిమాల్లో రాణిస్తున్నారు. అయితే ఆమె చేసే సినిమాలకంటే వేసుకునే దుస్తులే ఎక్కువ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆమె వయసు 60. ఇప్పటికీ పొట్టి దుస్తులు వేసుకుని నెటిజన్లను షాక్‌కు గురి చేస్తుంటారు.

Related posts