telugu navyamedia
సినిమా వార్తలు

వెన్నెల జల్లు-ప్రియా..రా!!

prema pakshulai poetry corner
వెన్నెల వరాల జల్లు
—————-
పసిడి కాంతుల బాట
జీవ జలముల ఊట
ఓ వెన్నెలమ్మ!
పరిమళించే తోట
సమతమమతల కోట
ప్రేమ వెలుగుల మూట
ఓ వెన్నెలమ్మ!
తల్లిదండ్రుల నోట
బ్రతుకు దిద్దే మాట
శాంతి నొసగే పాట
ఓ వెన్నెలమ్మ!
==================
రా!ప్రియా!రా!!
———————
హృదయ తలుపులు నీకై తెరిశాను
ప్రేమ పాన్పును సిద్ధం చేశాను
కనుల కాగడాలను వెలిగించుకుని
నీ రాకై వేచియున్నాను
రెక్కలు విప్పిన విహంగంలా
రెండు చేతులను చాపి మనఃపూర్వక
ఆహ్వానం పలుకుతున్నాను
నా హృదయ ప్రేమ సామ్రాజ్యంలోనికి
యువరాణివై,ప్రియరాలువై
రా!ప్రియా!రా!! సీతాకోకచిలుకలా
వలపుల వసంతాలు జరుపుకుందాం
ప్రేమగీతాలు పాడుకుందాం
తూర్పున ఉదయించిన సూర్యుని సాక్షిగా! ప్రేమకు చిహ్నంగా!
వలపుల రెక్కలు కట్టుకుని
ప్రేమ పావురమై
నా వెచ్చని మెత్తని ఒడిలో
ముదమారగా వాలిపో!
ప్రణయ కేళిలో మునిగిపో!
ప్రేమ దేవతగా నా గుండెలో
స్థిర స్థాయిగా ఉండిపో!!
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts