telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వెంకీ మామ” మా వ్యూ

Venky-mama

బ్యాన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ
న‌టీన‌టులు: వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్, నాజ‌ర్, రావు ర‌మేష్‌, ప్ర‌కాశ్‌రాజ్‌ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: కె.ఎస్‌.ర‌వీంద్ర‌ (బాబీ)
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
కెమెరా: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి
నిర్మాత‌లు: సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌

అక్కినేని ఫ్యామిలీ, ద‌గ్గుబాటి ఫ్యామిలీకి చెందిన హీరోలు… రియల్ లైఫ్ మామా, అల్లుళ్ళు వెంకటేష్, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `వెంకీమామ‌`. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్ద‌రి హీరోల అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు విపరీతమైన ప్రచారం కల్పించారు. తనకు ఇది మరో ‘మనం’ అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు. మొత్తానికి భారీ అంచనాల నడుమ… వెంకటేష్ పుట్టినరోజు కానుకగా ‘వెంకీమామ’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.

కథ :
వెంకటరత్నం నాయుడు అలియాస్ మిలిటరీ నాయుడు (వెంకటేష్) వాళ్ళ ఊళ్ళో మోతుబరి రైతు. అక్కడ ఆయనంటే అందరికి గౌరవం. నాయుడుకు తన అల్లుడు కార్తీక్ (నాగచైతన్య) అంటే ప్రాణం. కార్తీక్ అమ్మానాన్నలు చిన్నప్పుడే చనిపోతారు. దీంతో అన్నీ తానై కార్తీక్ ను పెంచుతాడు మిలిటరీ నాయుడు. నాయుడు తండ్రి రామనారాయణ (నాజర్) జాతకాల్లో బాగా ఆరితేరినవాడు. మిలిటరీ నాయుడును కార్తీక్ కు దూరంగా ఉండాలని చెబుతాడు. ఒకరోజు నాయుడుకు చెప్పకుండానే కార్తీక్ మిలిటరీకి వెళ్ళిపోతాడు. దీంతో నాయుడు కూడా కార్తీక్ ను వెతుక్కుంటూ అక్కడికి వెళతాడు. అసలు కార్తీక్ మిలిటరీకి ఎందుకు వెళ్ళాడు ? కార్తీక్ ను వెతుక్కుంటూ వెళ్ళిన నాయుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? నాయుడు తండ్రి కార్తీక్ కు దూరంగా ఉండాలని ఎందుకు హెచ్చరించాడు ? తదితర విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
వెంకటేష్ సినిమాకు వెన్నెముకగా నిలిచారు. ఎప్పటిలాగే కామెడీ, ఎమోష‌నల్ సీన్స్‌లో ఆయన నట విశ్వరూపం చూపించారు. ఇక చైత‌న్య సరికొత్త పాత్రలో నటించారు. మామ‌ను ప్రేమించే అల్లుడిగా చ‌క్క‌గా న‌టించాడు. ఇక పాయల్ రాజ్‌పుత్‌, రాశీఖ‌న్నా పాత్ర‌లను చూస్తే రాశీఖ‌న్నా త‌న గ‌త చిత్రాల‌కంటే కాస్త గ్లామ‌ర్ డోస్ పెంచే న‌టించింద‌నాలి. అయితే పాయ‌ల్ రాజ్‌పుత్ పాత్ర‌కే ప‌రిధి ఎక్కువగా ఉంది. ఇక పాయ‌ల్ రాజ్‌పుత్ టీచ‌ర్‌గా న‌టించినా.. ఆ పాత్రకు ఆమె పెద్దగా సరిపోలేదని అన్పిస్తుంది. విల‌న్స్‌గా న‌టించిన రావుర‌మేశ్, దాస‌రి అరుణ్‌లు వారి పాత్ర‌ల ప‌రిధి మేర న‌టించారు. నాజ‌ర్‌, విద్యుల్లేఖా రామ‌న్, నాగినీడు, చ‌మ్మ‌క్ చంద్ర‌ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
జాతకం కంటే ప్రేమే గొప్పదని, ప్రేమ ఎలాంటి జాతకాన్నైనా తిరగరాస్తుందనే పాయింట్ ను తీసుకున్నారు దర్శకుడు బాబీ. ఫ‌స్టాఫ్ కూల్ కామెడీ, యాక్ష‌న్ పార్ట్స్‌తో స‌ర‌దాగా సాగిపోతుంది. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే… క్లైమాక్స్, దానికి ముందు వ‌చ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకోవు. త‌మ‌న్ సంగీతం బావుంది. నేప‌థ్య సంగీతం ఫరవాలేదన్పిస్తుంది. ప్ర‌సాద్ మూరెళ్ల కెమెరా ప‌నితనం బావుంది. డైలాగ్స్ కొన్ని సంద‌ర్భాల్లో బాగా పేలాయి. నిర్మాణ విలువ‌లు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5

Related posts